Reels కోసం పిచ్చిపనులు – తాట తీస్తామంటున్న Police లు

హైదరాబాద్‌, జూన్‌ 22, (ఇయ్యాల తెలంగాణ) : సోషల్‌ విూడియా విస్తృతమైనప్పటి నుంచి టీనేజర్స్‌, యూత్‌ తో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏది చేయాలో.. ఏది చేయద్దో.. స్పృహ ఉండడం లేదు. ఒకడు కరెంటు తీగలు ముట్టుకుంటానంటాడు.. మరొకడు విషపు పాములను ముద్దు పెట్టుకుంటా అంటాడు. ఇంకొకడు బిల్డింగ్‌ పై నుంచి దూకుతానని అంటాడు. ఇలా ప్రతీ ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు. కేవలం 30 సెకండ్ల రీల్స్‌ కోసం ప్రణాన్ని విలువైన యవ్వనాన్ని పనంగా పెడుతున్నారు.మొన్నటికి మొన్న పుణెలో రీల్‌ చేసేందుకు అతిపెద్ద భవనం పై నుంచి ఒక లేడీ స్టంట్‌ చేసింది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ ఒక వేళ పైన పట్టుకునే వ్యక్తి చేయి జారి ఉంటే మాత్రం ఇప్పటికి పాడె లేచేది. మరి వీటితో ఏం లాభం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం లైకుల కోసమే ఇదంతా. దీనితో ఎవరికీ ఏవిూ ప్రయోజనం ఉండదు. టీచర్లు, పెద్దలు కొన్ని చదువుకునే వీడియోలు పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. సోషల్‌ విూడియాను ఇలా వాడుకుంటే పేదలకు సైతం చదువు అందుతుందని చెప్తున్నారు. 

కానీ యూత్‌ మాత్రం ఇలాంటి అర్థం పర్థం లేదని పనులు చేస్తూ టైం వేస్ట్‌ చేస్తుంది.తాజాగా, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున యూసుఫ్‌ గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ఎదుటకు బ్లాక్‌ టీషర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించి ఒక యువకుడు ఒక్కసారిగా వచ్చాడు. పాపం డ్రైవర్‌ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డాడు. కానీ బస్సు ఆ సమయంలో బ్రేకులు వేయలేక పోయాడు. వెంటనే ఆ యువకుడు బస్సు కింద మధ్యలో పడుకున్నాడు. బస్సు డ్రైవర్‌ యువకుడికి ఏవిూ కావద్దని ఎటు వైపునకు మలుపు తీసుకోకుండా నేరుగా పోనిచ్చాడు. దీంతో సదరు యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. తాపీగా లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ విూడియాలో ఇది వైరల్‌ కాగా.. యువకుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒకరికి కఠిన శిక్ష వేస్తే ఇలాంటి వారు మారుతారని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం లైకుల కోసం చేస్తున్న ఇలాంటి పిచ్చి పనులు విస్మయానికి గురి చేస్తుండగా.. యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....