RTC? ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలోని కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌ తమిళిసైకి పంపించారు. నెల రోజులుగా ఈ బిల్లుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లు అంశంపై న్యాయ పరిశీలన అనంతరం గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. టీఎస్‌ ఆర్టీసీ విలీనం బిల్లుకు గురువారం గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. రాష్ట్రప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత.. గవర్నర్‌ తమిళిసై ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపారు. గవర్నర్‌ న్యాయశాఖ పరిశీలన తర్వాత కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ వివరణపై సంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్‌ తమిళిసై.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించే బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు మారనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ అభినందనలు తెలిపారు.కాగా.. ఆగస్టు 06వ తేదీన తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల వీలిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల బాధలను, సంస్థను పరిగణలోకి తీసుకుని.. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. ఆర్టీసీ బిల్లు అసెంబ్లీ పెట్టే సమయంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది బేసిక్‌గా ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లు కావడంతో సభలో పెట్టక ముందు గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ టైంలో బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమతి ఇచ్చేందుకు గవర్నర్‌ అంగీకరించలేదు. సభ ఆఖరి రోజు కూడా ఆమోదం లభించదేమో అని గ్రహించిన ఆర్టీసీ సిబ్బంది రాజ్‌భవన్‌ వద్ద ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచిన గవర్నర్‌ తనకు ఉన్న అనుమానులు వారికి వివరించారు. వాటిపై స్పందించిన ప్రభుత్వం ఫైనల్‌ కాపీలో అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చివరకు ఆఖరి నిమిషంలో సభ ముందుకు ఆర్టీసీ విలీనం బిల్లు వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌… గవర్నర్‌ తమిళిసై తెలిసీ తెలియక వివాదం చేశారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపణలు చేశారని, కానీ తాము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. త్వరలో ఆర్టీసీ సేవలు విస్తరిస్తామని, యువ ఐఏఎస్‌లను నియమించి మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారుఏ పని చేసినా కూడా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని ఆర్టీసీ సంస్థను గాడిలో పెడతామని కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు. ఇదిలాఉంటే.. ఆర్టీసీ విలీనం బిల్లును రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఆస్తులు యధాతథంగా ఉంటాయని తెలిపారు. అలాగే ఆర్టీసీ కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి పీఆర్‌సీ ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడిరచింది. కాగా.. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడం పట్ల ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎట్టకేలకు గవర్నర్‌ ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలపడంతో దీనిపై ఇన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....