హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద్రగిరి సత్యనారాయణ నియమితులైనారు. ఇటీవలే ఎస్సీ ఉపకులాల జాతీయ అధ్యక్షుడు భైరి వేంకటేశ్ నియమక భాద్యతలు అందించారని చంద్రగిరి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా ఎస్సీ 57 ఉపకులాల కుటుంబాలు నేటికి సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఏలాంటి అభివ్రృద్దికి నోచుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు నేటికి సైతం ఎస్సీ ఉపకులాల వారికి కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారే గానీ వారి జీవితాలకు న్యాయం చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 57 ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరిగే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ద పడతామని అన్నారు. ఉపాధక్షునిగా భాద్యతలు అప్పగించినందుకు భైరి వేంకటేశ్ కి ధన్యవాదాలు తెలిపారు.
- Homepage
- Telangana News
- SC ” ఉపకులాల హక్కుల పోరాట సమితి” రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా Satyanarayana
SC ” ఉపకులాల హక్కుల పోరాట సమితి” రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా Satyanarayana
Leave a Comment