SC డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కిట్ల పంపిణీ

 

చాంద్రాయణ గుట్ట, డిసెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ) : బట్జీ నగర్ లో SC డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ చేతులమీదుగా క్రిస్మస్ పండుగ సందర్బంగా కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.జంగమ్మెట్ డివిజన్ కార్పొరేటర్ ఎండీ అబ్దుల్ రెహమాన్ డివిజన్ సంక్షేమ కార్యక్రమాలో బిజీగా ఉన్నందున పులికంటి నరేష్ క్రిస్మస్ కిట్స్ పంచారు.   ఈ సందర్బంగా పులికంటి నరేష్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం MLA అక్బరుద్దీన్ ఒవైసి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మంది నిరుపేదలకు కుల మతాల కతీతంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పేద ప్రజలు అందుకునేలా చూస్తున్నారని అన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ప్రజలందరూ ప్రభుత్వ పాలనలో భాగస్వాములు కావాలని SC డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ యోనా,అభి,నరేందర్, తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....