SC డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ జయంతి !

హైదరాబాద్, ఏప్రీల్ 14 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ  డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో భట్జ్ నగర్, కందికల్ గేట్ లో  ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ డా. భీం రావు అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పులికంటి నరేష్ డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ సూచించిన మార్గంలో మనమంతా నడవాలని ఆయన ఆశయాలకనుగుణంగా విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలను అంది పుచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తి వాసులు అరుణ్, సునీల్, శివకుమార్, రవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....