SC/ST వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం !

 జాతికి రత్నముగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక అభినందనలు 

హైదరాబాద్, ఆగష్టు 03 (ఇయ్యాల తెలంగాణ) :  ఎస్సీ ఎస్టీ వర్గీకరణ 30 సంవత్సరాలు పోరాట ఫలితమని  అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఉపవర్గీకరణ కోసం అహర్నిశలు జాతికి ఒక రత్నముగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు ప్రత్యేక అభినందనలను తెలియ జేశారు.  తనకు ఎన్నో పదవులు ముందుకు వచ్చిన ఎడమ చేతిని తోసేసి నాకు జాతి ప్రయోగమే ముఖ్యం జాతి కోసం ఏ పదవి నైనా త్యాగానికి సిద్ధం అదే సిద్ధాంతంతో ముందుకు వెళ్లిన నిజమైన నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఈరోజు ప్రతి ఒక్క జాతి బిడ్డలు మందకృష్ణ మాదిగని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుచు అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు మందకృష్ణ మాదిగ గారికి తెలిపారు.  దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన హామీని నెరవేర్చి పేదల ప్రజల ప్రధాని అని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....