SCHOOL గేమ్‌ ఫెడరేషన్‌ మండల స్థాయి క్రీడలను ప్రారంభించిన ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి

నందికొట్కూరు సెప్టెంబర్‌ 13 (ఇయ్యాల తెలంగాణ ):బిజినవేముల జడ్పీహెచ్‌ హై స్కూల్‌ నందు బుధవారం ఎస్‌ జి ఎఫ్‌ నందికొట్కూర్‌ మండల స్థాయి క్రీడా పోటీలు ఎంపిక పోటీలను జడ్పిటిసి కలిమునిస తాసిల్దార్‌ రాజశేఖర్‌ బాబు విద్యాధికారి ఫైజునిష బేగం హెచ్‌ఎం లక్ష్మీ ప్రసన్న వివిధ ఆటల పోటీలను ప్రారంభించారు అండర్‌ 17 కింద జరిపిన వాలీబాల్‌, త్రో బాల్‌ ,కోకో ,కబడి,అథ్లెటిక్స్‌ గేమ్స్‌ కు మండలంలోని ఐదు జడ్పీహెచ్‌ పాఠశాలల నుండి ఏపీ మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ మొత్తం ఏడు పాఠశాలల నుండి విద్యార్థులు సుమారు 200 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి అన్నారు మానసికంగా శారీరకంగా క్రీడలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతామన్నారు విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు ప్రతి విద్యార్థి ఓ లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో  వైసిపి నాయకులు పబ్బతి రవి డిప్యూటీ తాసిల్దార్‌ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి రవీంద్ర ఎస్‌ జి ఎఫ్‌ సెక్రెటరీ శ్రీనాథ్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌ వ్యాయామ ఉపాధ్యాయులు ఈరన్న రాఘవ సుబ్బయ్య శ్రీను సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....