School యూనిఫామ్స్‌ – త్వరగా రెడీ చేయాలి..


👉 స్కూల్‌ యూనిఫామ్స్‌ – త్వరగా రెడీ చేయాలి..

👉 సంవత్సరం పాటు విద్యార్థులు ధరించేలా కుట్టండి..

👉 మన్నికగా ఉండేలా చూడండి

👉 విూ పిల్లల బట్టలే కుడుతున్నామనుకోండి..

👉 స్కూల్లు ప్రారంభమయ్యే లోపు విద్యార్థులకు అందించాలి..

👉 జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి – స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టే ప్రక్రియ పరిశీలన

కరీంనగర్‌, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంవత్సరం పాటు ధరించేలా మన్నికగా యూనిఫామ్స్‌ కుట్టాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. స్కూల్లు ప్రారంభమయ్యే లోపు యూనిఫామ్స్‌ రెడీ చేయాలని పేర్కొన్నారు.  గంగాధర మండలం రంగారావు పల్లిలో  మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టే ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు.  యూనిఫామ్స్‌ కుడుతున్న స్వశక్తి మహిళలతో మాట్లాడారు. రోజుకు ఎన్ని యూనిఫామ్స్‌ కుడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. దుస్తులు సంవత్సరం కాలం పాటు మన్నికగా ఉండేలా డబుల్‌ స్టిచ్చింగ్‌ చేయాలని సూచించారు. లేకపోతే తొందరగా కుట్లు పోతాయని వివరించారు.  యూనిఫామ్స్‌ విూ పిల్లలవే కుడుతున్నామనుకొని భావించి మంచిగా కుట్టాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ యూనిఫామ్స్‌ కి వాడే దారానికి సంబంధించిన ఖర్చులు తాను చెల్లిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా దుస్తులు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా చెల్లిస్తామని చెప్పారు. స్కూల్స్‌ ప్రారంభమయ్యే లోపు యూనిఫామ్స్‌ రెడీ కావాలని పేర్కొన్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు యూనిఫాంలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో కస్తూర్బా, మోడల్‌ స్కూల్లు, అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 30,810 మందికి యూనిఫామ్స్‌ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. యూనిఫామ్స్‌ కుట్టే ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నదని,  ఇందులో స్వశక్తి మహిళలు నిమగ్నమై ఉన్నారని వివరించారు. వారు ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిఆర్డిఏ సునీత, డీఎల్పీఓ రాంబాబు, తహసిల్దార్‌ వినయ్‌ కుమార్‌, డిపిఎం ప్రవీణ్‌, ఎంపీఓ జనార్దన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....