SCRAP దుకాణానికి చేరిన పాఠ్యపుస్తకాలు గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్వాకం

నాగర్‌ కర్నూలు జూన్ 27, (ఇయ్యాల తెలంగాణ ) 2024 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేతిలో ఉండాల్సిన పాఠ్యపుస్తకాలు చెత్తకుప్పకు చేరాయి…. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 కట్టల పుస్తకాలు కనీసం సీల్‌ కూడా తీయనివి ఆరు నుంచి పదవ తరగతి వరకు కలిగిన ఇంగ్లీష్‌ పుస్తకాలు  స్క్రాప్‌ కు చేర్చిన సంఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో సంచలనం రేపింది…. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు అచ్చంపేట పట్టణ కేంద్రంలోని స్క్రాప్‌ దుకాణానికి చేర్చారు… గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చెందిన ఇంగ్లీష్‌ పుస్తకాలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు   ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు సకాలంలో అందజేయకుండా వాటిని నిలువ చేసి డబ్బులకు కక్కుర్తి పడి వాటిని స్క్రాప్‌ కింద విక్రయించేందుకు యత్నించిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారుల బాగోతాన్ని స్థానికులు బయటపెట్టారు. నిన్న రాత్రి పట్టణంలోని ఓ చెత్త కాగితాలు విక్రయించే డంపింగ్‌ దుకాణంలో అచ్చంపేట నియోజకవర్గం లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలను వారికి పంపిణీ చేయకుండా సంబంధిత అధికారులు వాటిని బహిరంగ మార్కెట్లో స్క్రాప్‌ కింద విక్రయించి డబ్బులు చేసుకునేందుకు కక్కుర్తి పడి విక్రయిస్తున్న సంగతి బహిరంగపరిచారు. వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడం ఏమిటని వారు సంబంధిత అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పాఠ్యపుస్తకాలను ఆటోలో పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందకుండా చేసిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చంపేట నియోజకవర్గం లోని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....