హైదరాబాద్ మార్చ్ 4 (ఇయ్యాల తెలంగాణ) : రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ రేపు (మంగళవారం) సికింద్రాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ప్రముఖ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని మోడీ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది.మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంగారెడ్డిలో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు హాజరవుతారు. కాగా, రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణకు వచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ప్రధాని మోడీ రాజ్ భవన్‌లో బస చేయనున్నారు.
- Homepage
- Telangana News
- Secunderabad ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని Modi
Secunderabad ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని Modi
Leave a Comment