హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ మధులత సమక్షములో సీడ్ గణేశుల పంపిణీ జరిగింది. తెనాలి డబుల్ హార్సు మినపగుండ్లు వారు తయారు చేసిన మట్టిగణేశులు లాలాగూడ పోలీసుల ఆధ్వర్యంలో పలువురికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డభుల్ హార్స్ రీజినల్ మేనేజర్ ప్రవీణ్ గౌడ్ , షాహీద్ SI గారు, రాజేశ్ గౌడ్ పెద్దన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.