Srisailam ప్రసాదంలో మాంసపు ఎముక : భక్తుల ఆగ్రహం

కర్నూలు, ఫిబ్రవరి 9 (ఇయ్యాల తెలంగాణ) : హిందువులు పండగలు, పర్వదినాల సమయంలో మాత్రమే కాదు.. పుణ్యక్షేత్రాల దర్శనం, పూజల సమయంలో ఆహార నియమాలను పాటిస్తారు. తామసిక ఆహారానికి దూరంగా ఉంటారు. ఇక ఆలయంలో దేవుళ్ళకు నైవేద్యంగా సమర్పించే ఆహారం తయారీ, ప్రసాద వితరణలో కూడా ఎన్నో నియమ నిష్ఠలను పాటిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని వినియోగించకుండా తయారు చేస్తారు. అయితే తాజాగా పవిత్ర శ్రీశైలంలోకి మద్యం మాంసం ప్రవేశం అన్న వార్తలు మరిచిపోక ముందే .. తాజాగా శ్రీశైలం ఆలయం క్షేత్ర పరిధిలో మహా అపచారం జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. మల్లన్న భ్రమరాంబ దంపతులను దర్శనం చేసుకుని తరిస్తారు. తాజాగా క్షేత్ర పరిధిలో భక్తులకు  పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఈ ప్రసాదంలో మాంసపు ఎముక రావడంతో కలకలం సృష్టించింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన చోటు చేసుకుంది.తనకు పంపిణీ చేసిన పులిహోరలో మాంసపు ఎముకను హరీష్‌ రెడ్డి అనే భక్తుడు గుర్తించారు. వెంటనే  దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్య క్షేత్రంలో ఇటువంటి అపచారాలు జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....