శ్రీశైలం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈనెల 26 న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ,పోలీస్ అధికారులతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశం పరిపాలన భవనంలో నిర్వహించారు. ఈసమావేశంలో ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ 26న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి,కొబ్బరి,నిమ్మకాయలు సమరపిస్తామన్నారు.అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు,పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు జంతుబలి నిషేధానికి పోలీస్,రెవెన్యూ సిబ్బంది కూడా వారి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు అలానే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తామన్నారు.ముందు రోజు రాత్రి నుండే ఆలయ మాడవీధులు, అంకాళమ్మ,పంచమఠాలు,మహిషాసురమర్ధిని ఆలయం వద్ద సిబ్బందికి గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామన్నారు. జంతుబలులు జరగకుండా దేవస్థానం టోల్ గేట్ వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ,పోలీస్ అధికారులకు సూచనలు చేశారు జంతుబలి నిషేధాన్ని భక్తులలో అవగాహన కోసం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి కుంభోత్సవం క్షేత్ర పండుగ కారణంగా ఆరోజు అమ్మవారి దర్శనానికి స్థానిక భక్తులు పొట్టతే కారణంగా క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తొక్కిసలాటలు లేకుండా చూడాలన్నారు.అలానే కుంభోత్సవం రోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు కూడా నిలిపివేసేలా జిల్లా కలెక్టర్ ని కొరతమని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.