సనత్ నగర్ ఆగష్టు 4 (ఇయ్యాల తెలంగాణ) : సమస్యల పరిష్కారం కోసం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పలు కాలనీలు సందర్శించారు. అక్కడి ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సంజీవ రెడ్డి నగర్ కాలనీ లో స్థానీకుల సమస్యలు మేరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా ఇంచార్జి ఆకుల విజయ ఎస్.ఆర్.టి కాలనీ లో పర్యాటించారు. ప్రధానంగా .డ్రైనేజీ, రోడ్లకి సంబందించిన సమస్యలు స్థానికులు తెలియజేసారు,వెంటనే జలమండలి శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు మరియూ మిగతా సిబ్బంది వివిధ విభాగాల అధికారులతో మాట్లాడి అక్కడ పరిస్థితి గురించి తెలుసుకొని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నవీన్ గౌడ్, పోలిమేర సంతోష్ కుమార్ దశరత్ గౌడ్, సతీష్ రెడ్డి, ఉత్తమ్ సింగ్ కాలనీ ప్రజలు శ్రీను, ప్రవీణ్, అశోక్, వేణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Sanath Nagar News
- SRT కాలనీ లో సమస్యలను పరిశీలించిన BJP మహిళా మోర్చా National Member ఆకుల విజయ.
SRT కాలనీ లో సమస్యలను పరిశీలించిన BJP మహిళా మోర్చా National Member ఆకుల విజయ.
Leave a Comment
Related Post