Star Hero సూర్య ప్రెస్టీజియస్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ ‘కంగువ’ Teaser రిలీజ్‌

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ ‘కంగువ’ టీజర్‌ రిలీజైంది. ఈ టీజర్‌ విజువల్‌ వండర్‌ గా ప్రేక్షకుల్ని సర్‌ ప్రైజ్‌ చేసింది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్‌ సీక్వెన్స్‌ స్క్రీన్‌ విూదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్‌ ఫైటింగ్‌, బిగ్‌ షిప్‌ వార్‌ సీన్స్‌ తో వరల్డ్‌ సినిమా హిస్టరీలోని ఎపిక్‌ వార్‌ మూవీస్‌ ను ‘కంగువ’ టీజర్‌ గుర్తు చేసింది. హై క్వాలిటీ విజువల్స్‌ ను దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరింత ఎలివేట్‌ చేసింది. ఉధిరన్‌ తో కంగువ చేసిన రూత్‌ లెస్‌, ఫెరోషియస్‌ ఫైట్‌ టీజర్‌ లో హైలైట్‌ గా నిలిచింది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్‌, క్యారెక్టర్‌ లో రిఫ్లెక్ట్‌ అయ్యింది.’కంగువ’ సినిమాను భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్‌ బడ్జెట్‌ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ ను మేకర్స్‌ అనౌన్స్‌ చేయబోతున్నారు.

నటీనటులు ` సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....