జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
జగిత్యాల జూన్ 13 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యాభ్యాసం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.గురువారం జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల మండల కేంద్రాలలో జరిగిన బడి బాట కార్యక్రమంలో భాగంగా ఏక రూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత భాగంగా అమ్మ ఆదర్శ కమిటీలకు పాఠశాలల్లో కనీస మాలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, పెద్ద, చిన్న మరమ్మత్తుల పనులను కమిటీలకు అప్పగించడం ముఖ్యమంత్రి ఆలోచనా విధానంలు అనుగుణంగా జరిగిందని తెలిపారు. ఆయా పనులను కమిటీలు పర్యవేక్షించాలని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో అప్పగించిన పనులు సక్రమంగా చేస్తాయని తెలిపారు. అందుకు నిదర్శనం కేవలం 20 రోజుల్లోనే మహిళా సంఘాల సభ్యులు పాఠశాలల పిల్లలకు యూనిఫాం లు కట్టించడం జరిగాయని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 591 పాఠశాలల్లో రు. 43.45 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతున్నదని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని , భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. అవసరం మేరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుచేయడం జరుగుతున్నదని తెలిపారు. దేవుడి తరువాత తలరాత మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులపై వుందని తెలిపారు. వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు.
ఆనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని, ఉపాద్యాయులు నాణ్యమైన బోధన చేసి విద్యార్థులను మంచి పౌరులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2 వేల కోట్లు నిధులను కేటాయించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లో మొదటి స్థానంలో జిల్లాను నెలకొల్పాలని అన్నారు. స్వంత ప్పిల్లల్లాగ విద్యార్థులను చూసుకోవాలని అన్నారు. చొప్పదండి నియోజక వర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని అన్నారు. ఉపాద్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. కార్యక్రమం మొదట్లో రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలను ఎమ్మెల్యే, కలెక్టర్ లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో సంపత్ రావు,డీపీవో దేవరాజ్,డీఉవో జగన్ మోహన్ రెడ్డి, మండలాల ప్రజా ప్రతినిధులు, పాఠశాలల ఉపాద్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలలో కమిటీలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.