సురేష్‌ ప్రొడక్షన్స్‌, కల్ట్‌ సీక్వెల్‌ ‘ఇNఇ రిపీట్‌’

’ఈ నగరానికి ఏమైంది’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని, ముఖ్యంగా యువతను ఆకట్టుకుని సంచలనాత్మక విజయం సాధించి కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది. సినిమా రీరిలిజ్‌ మరింత ఎక్సయిట్మెంట్‌ క్రియేట్‌ చేసింది. సినిమాలో పాత్రలు, హ్యుమర్‌, లైఫ్‌ కి కనెక్ట్‌ అయ్యే కథతో ఈ చిత్రం మ్యాసీవ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌ అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఇNఇ రిపీట్‌ టైటిల్‌ తో ఈ ప్రాజెక్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మళ్ళీ అదరగొట్టబోతోందనే హావిూ ఇస్తోంది. దాదాపు ఒరిజినల్‌ స్టార్‌ కాస్ట్‌, టెక్నికల్‌ టీం తో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్‌ నోస్టాల్జియా ఫీలింగ్‌ ని కలిగిస్తుంది.  

ఫస్ట్‌ పార్ట్‌ లో అందరినీ అలరించిన గ్యాంగ్‌ విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమటం, వెంకటేష్‌ కాకుమాను మరోసారి మ్యాడ్‌నెస్‌ క్రియేట్‌ చేయబోతున్నారు. ఒరిజినల్‌ ని క్రియేట్‌ చేసిన క్రియేటివ్‌ పవర్‌ హౌస్‌ తరుణ్‌ భాస్కర్‌ ఈ సీక్వెల్‌ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ ఒరిజినల్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ల పై డి. సురేష్‌ బాబు, సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.

టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఒక హిలేరియస్‌ ట్రీట్‌ లా వుంది. ఈ మూవీ టైటిల్‌ ఇఔఇ రిపీట్‌. ఇది మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని ప్రామిస్‌ చేస్తోంది. టైటిల్‌ లోగో తెలుగు లెటర్స్‌ ని తెలివిగా మిక్స్‌ చేస్తోంది. ఇక్కడ ఇఔఇ యొక్క మొదటి, చివరి అక్షరాలు తెలుగులో కనిపిస్తాయి, చివరి అక్షరాలు తిప్పబడి మూవీ ఆఫ్‌బీట్‌ టోన్‌ను ప్రజెంట్‌ చేస్తున్నాయి. ఏలనాటి శని పోయింది, కన్యారాశి టైమ్‌ ఒచ్చింది అనే ట్యాగ్‌లైన్‌, గాలిలో ఎగిరిపోతున్న బట్టలు, బ్రీఫ్‌కేస్‌, బీర్‌ బాటిళ్లు, సన్‌ గ్లాసెస్‌, విమాన టికెట్‌ ఇవన్నీ ఆకాశమంత సాహసాన్ని ప్రజెంట్‌ చేస్తున్నాయి. ఇది కేవలం కొనసాగింపునే కాదు, మ్యాడ్‌ నెస్‌ ని మరింత పెంచుతుంది. ఎంటర్‌ టైన్మెంట్‌, ఎనర్జీని రెట్టింపు చేస్తుందని హావిూ ఇస్తుంది.

ఈ సీక్వెల్‌ ట్యాలెంటెడ్‌ టెక్నిషియన్స్‌ పని చేస్తున్నారు. ఒరిజినల్‌ కంపోజర్‌ వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తు సిరీస్‌ సిగ్నేచర్‌ వైబ్‌ను కొనసాగిస్తున్నారు. ంఏ ఆరోన్‌ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, రవితేజ గిరిజాల ఎడిటర్‌. సౌమిత్రి ఎన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పూర్తి స్థాయిలో జరుగుతోంది.

తారాగణం: విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ గోమతం, వెంకటేష్‌ కాకుమాను

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....