TDP ర్యాలీ?ఉద్రిక్తత

తాడేపల్లిగూడెం అక్టోబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ):పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో.. తెలుగుదేశం నేతల ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు 10 వేల మందితో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. నేతలను గృహనిర్భంధం చేసినప్పటికీ చాలా మంది పోలీసుల ఆంక్షల వలయం దాటుకుని బయటకు వచ్చారు. ఈ నేపధ్యంలో పోలీసులకు టిడిపి నేతలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో  తాడేపల్లిగూడెం టిడిపి ఇంఛార్జి వలవల బాబ్జీ కింద పడిపోయారు. దింతో బాబ్జి  అస్వస్థతకు గురయ్యాడు. అదేవిధంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేశారు. దీక్షాశిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. అయినా నాయకులు వెనక్కి తగ్గకుండా పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా.. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మహాపాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత పాలనలో ఉన్నామా అంటూ మండిపడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....