Telanganaలో బెనిఫిట్‌ షో సినిమాలకు అనుమతి లేదు – హైకోర్టు

హైదరాబాద్‌,  మార్చి 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్‌ షో, స్పెషల్‌ షో, ప్రీమియర్‌ షోలకు హైకోర్టు అనుమతిని నిరాకరించింది. అంతేకాక.. 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది టికెట్‌ ధరల పెంపును కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా.. ప్రభుత్వ తరుఫు న్యాయవాది ధరల పెంపును రద్దు చేసినట్లు తెలిపారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్‌ షో, స్పెషల్‌ షో, ప్రీమియర్‌ షోలకు అనుమతిని నిరాకరిస్తూ.. తదుపరి విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప`2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏ సినిమాకి కూడా బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు మాత్రం టికెట్‌ ధరల పెంపునకు అనుమతి లభించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....