Telangana అప్పులు రూ.6,71,757 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయానికి అప్పులు రూ.72,658 కోట్లు

రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి

పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసింది

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ డిసెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో భట్టి శ్వేత పత్రం విడుదల చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు. కాగా అంతకు ముందు ఏఐఎంఎం పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎన్నికయ్యారు. సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌గా కూనంనేని సాంబశివరావులు ఎంపిక అయినట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు.తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ మేరకు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయానికి అప్పులు రూ.72,658 కోట్లుగా ఉండగా పదేళ్లలో సంవత్సరానికి 24.5 శాతం చొప్పు పెరిగినట్టు పేర్కొంది. ఆదాయం రాబడిలో రుణాల చెల్లింపులు 34 శాతం, ఉద్యోగుల జీవితాలు, పెన్షన్లకు 35 శాతం కేటాయించినట్టని పేర్కొంది.కాగా.. నేడు సభ ప్రారంభమవగానే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సంతాప తీర్మానాలను పెట్టారు. మెదక్‌ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్‌ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం.. ఆయన కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలిపింది. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్‌ రెడ్డి.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సభ సంతాపాన్ని తెలిపింది. ఈ ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా సభ 2 నిమిషాలు మౌనం పాటించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....