Telangana అభివృద్ధికి కేంద్ర సర్కార్‌ పూర్తిగా సహకరిస్తుంది: ప్రధాని Modi

ఆదిలాబాద్‌ మార్చ్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ  సర్కార్‌ పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో వర్చువల్‌ విధానంలో రూ.6 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.’’రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్‌కు సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ.56 వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించాం. అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించాం’’ అని అన్నారు. అంబారీ ` ఆదిలాబాద్‌ ` పింపాలకుట్టీ రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ రెండో థర్మల్‌ పవర్‌ యూనిట్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళి సై, సీఎం రేవంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....