అసెంబ్లీ ఆవరణలో కూలిన భారీ వృక్షం – తప్పిన ప్రాణాపాయం
హైదరాబాద్ సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది.మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చెట్టు కింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వసం అయ్యాయి. చెట్టుకింద ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కాలం హైదర్‌గూడలో భారీ వృక్షం కూలీ ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.