Telangana కేబినెట్‌ కు EC బ్రేక్‌

హైదరాబాద్‌, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ కేబినెట్‌ సమావేశానికి  కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి  అధ్యక్షతన శనివారం సాయంత్రం కేబినెట్‌ భేటీ కానుందని రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ మధ్య విభజన వివాదాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే, ఓ వైపు లోక్‌ సభ ఎన్నికల కోడ్‌, మరోవైపు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సాగుతోన్న నేపథ్యంలో ఈసీ కేబినెట్‌ భేటీకి అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, ఈ నెల 27న ఖమ్మం ` వరంగల్‌ ` నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ జరగనుంది. అటు, లోక్‌ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ముగియనుంది. ః

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....