హైదరాబాద్ మార్చ్ 4 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (ుూ ఆూఅ) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే (సీబీటీ) ఈ పరీక్షల తేదీలను ఇంకా వెళ్లడిరచలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది.
అర్హతలు.. నిబంధనలు
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్ వారు పోటీపడేఅవకాశంలేదు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత మెథడ్‌లో బీఎడ్ పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తిచేసినవారు సైతం పోటీపడొచ్చు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్ తేదీగా 1`7`23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏండ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5, దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు వర్తిస్తుంది.
తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి.
గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.
ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.
గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు.
అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4`10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1`7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.
జీవో`3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.