Telangana రాష్ట్ర కొత్త సీఎస్ గా కె. రామకృష్ణా రావు

 

హైదరాబాద్, ఏప్రీల్ 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీ (సీఎస్) గా కె. రామకృష్ణా రావు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్న శాంతా కుమారి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా రామకృష్ణా రావు ను ఖరారు చేసింది. 1990 ఐఏఎస్  బ్యాచ్ కు చెందిన రామకృష్ణా రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆయన ఆగస్టు మాసంలో రిటైర్డ్ కానున్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించ డంలో ఆయనకున్న అనుభవం తోడ్పడుతుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను సీఎస్ గా నియమించినట్లు సమాచారం 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....