Telangana రాష్ట్ర వ్యాప్తంగా ఇక క్రమశిక్షణ పద్ధతులు !

హైదరాబాద్‌, జూన్‌ 12, (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక క్రమశిక్షణ పద్ధతులు అమలుచేయనున్నారా? సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారా? అవును నిజమే రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని గవర్నమెంట్‌ ఆఫీసుల్లో బయోమెట్రిక్‌ హాజరును అమలుచేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. సచివాలయం సిబ్బంది ప్రతిరోజూ కార్యాలయం లోపలకి, బయటకు వెళ్లేటప్పుడు బయోమెట్రిక్‌ పంచ్‌ తప్పనిసరిగా చేయాలనే యోచనలో రేవంత్‌ సర్కార్‌ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే ఈ పంచింగ్‌ సిస్టమ్‌ సీఎం కూ వర్తిస్తుందని సీఎం టూ అటెండర్‌ వరకూ తప్పనిసరిగా బయోమెట్రిక్‌ థంబ్‌ నైల్‌ ఉండబోతోందని సమాచారం.ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన విమర్శలను సీఎం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముందుగా సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని సీఎస్‌ శాంతికుమారికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని యోచిస్తున్నామన్నారు.

ఫలితంగా మంత్రులు, ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగులకు కూడా పంచ్‌లు చేయాల్సి ఉంటుందని సీఎం తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. సీఎం, సీఎస్‌, మంత్రులందరూ బయోమెట్రిక్‌ హాజరును పాటిస్తున్నందున కిందిస్థాయి ఉద్యోగుల విమర్శలకు ఆస్కారం ఉండదని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం కోరుతున్న సంగతి తెలిసిందే. కార్యాలయానికి వచ్చినప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు కూడా పంచ్‌లు వేస్తే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయం తొలగిపోతుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది. బయోమెట్రిక్‌ వల్ల ఉద్యోగులపై నిఘా, పనుల్లో వేగం పెంచడంతోపాటు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే అవకాశం ఉందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట్లో ఉద్యోగుల నుంచి విమర్శలు వచ్చినా.. చివరికి ప్రజల నుంచి ప్రశంసలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....