Telangana లో ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్‌

వరంగల్‌, డిసెంబర్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్‌ లోతుగా కసరత్తు చేస్తోంది.ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ లో లబ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ స్కీమ్‌ అమలు కోసం ప్రత్యేకంగా యాప్‌ ను రూపొందించింది.ప్రభుత్వం నిర్ణయించటంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ ను అధికారులు సిద్ధం చేశారుÑనిజామాబాద్‌, కొత్తగూడెం, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ యాప్‌ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు కూడా సేకరించారు. ఇది విజయవంతం కావటంతో పూర్తిస్థాయిలో యాప్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రస్తుతం తెలంగాణలో ఏడాది ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగానే రేపు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించ నున్నారు. ఈ యాప్‌ అందుబాటులోకి రావటంతో ఇళ్ల మంజూరు, అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారుతొలి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఈ విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించు కునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవలే అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని,,,. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని కూడా దిశానిర్దేశం చేశారు.ఇక ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవలే అధికారులకు కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని,,,. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని కూడా దిశానిర్దేశం చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....