Telangana లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేవిూ లేదు !

 మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 2 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వచ్చిన ఇబ్బందేవిూ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శాసనసభలో సివిల్‌ కోర్టుల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. సివిల్‌ కోర్టుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కెటిఆర్‌కు పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా మంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఫేక్‌ వీడియోలు పెడుతున్నారని, సభా కార్యక్రమాలపై ఫేక్‌ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....