Telangana లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్‌ మే 14 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ళతో కూడిన భారీ వర్షం పడొచ్చని హెచ్చరించింది.మెదక్‌, కామారెడ్డి, ములుగు, రంగారెడ్డి, నాగర్‌ కర్నూలు జిల్లాల్లో గంటకు నలభై, యాభై కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఇక, హైదరాబాద్‌లో ఇవాళ, రేపు చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....