Telangana లో రాజకీయం అంతా హైడ్రా చుట్టూ – సొంత పార్టీలోనే వ్యతిరేకత !

హైదరాబాద్‌, ఆగస్టు 27  (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు హైడ్రా  కూల్చివేల చుట్టూ తిరుగుతోంది. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి … చెరువుల్ని కబ్జాల నుంచికాపాడకపోతే తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించనట్లేనని.. సొంత వాళ్లు ఉన్నా సరే వదిలి పెట్టబోనని ప్రకటించేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటి వరకూ హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా మాట్లాడుతున్న వారు చాలా  పరిమితంగానే  ఉన్నారు. కానీ వ్యతిరేకించేవారు మాత్రం..  ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది రాజకీయంగా కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతలు చెరువుల్ని కబ్జా చేసిన వారి భరతం పట్టడానికనని చెబుతున్నారు. 

కానీ ఈ చెరువుల్ని సామాన్యులు ఎవరూ కబ్జా చేయలేరు. సామాన్యులు చెరువు శిఖం భూమిలో చిన్న షెడ్డు కూడా వేయలేడు. కానీ రాజకీయ నేతలు .. చేతిలో అధికారం ఉన్న వారు మాత్రం..  శిఖం భూములే కాదు..  భారీ అంతస్తుల నిర్మాణాలు కూడా  పూర్తి చేస్తారు. వారికి అడ్డం ఉండదు. గత పదిహేను..ఇరవై ఏళ్లుగా వివిధ చెరువులను కబ్జా చేయడం.. శిఖం  భూముల్లో ఉన్న నిర్మాణాలన్నీ రాజకీయ నేతలు.. వారి అనుచరులు… బినావిూల నిర్వాకాలే. ఆ  పార్టీ.ఈ పార్టీ అనే తేడా ఉండదు. అందరిదీ అదే పని. అందుకే ఇప్పుడు అలాంటి కట్టడాలను కూలగొడితే ఖచ్చితం?గా పొలిటికల్‌ ఎఫెక్ట్‌ వస్తుంది. అది ఇప్పుడు  ప్రాథమిక స్థాయిలో తెలంగాణ సర్కార్‌ పై కనిపిస్తోంది. దానం నాగేందర్‌ హైడ్రా కూల్చివేతలపై బహిరంగ వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిజానికి ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. కానీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన అసంతృప్త్పితో రేవంత్‌ రెడ్డికి పెద్దగా నష్టం జరిగేవిూ ఉండదని అను?కుంటున్నారు. కానీ హైదరాబాద్‌కు సంబంధం లేకపోయినా అనేక మంది కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు.. వారి బంధువుల వ్యాపారాలు హైదరాబాద్‌లోనే ఉంటాయి. 

అవి కూడా ఎక్కువ భూమితోనే ముడిపడి ఉంటాయి. హైడ్రా కూల్చివేతల పరంగా చూస్తే కాంగ్రెస్‌ నేతల ఫామ్‌ హౌస్‌లు.. ఇతర వాటిపై విరుచుకుపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే రేవంత్‌ చిత్తశుద్ధిపై ప్రజలకు అనుమానాలొస్తాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతల ఆస్తుల జోలికి వెళ్తే వారికి కోపం వస్తుంది. చాలా మంది సైలెంట్‌ గా ఉన్నారు కానీ.. కూల్చివేతలపై వ్యతిరేకంగా ఉన్నారు. మరో వైపు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్‌  కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన మొదట్లో మజ్లిస్‌ ఎమ్మెల్యే ఆక్రమణలను తొలగించారు. తాజాగా  బండ్లగూడ చెరువులో ఫాతిమా ఓవైసీ కాలేజీ కట్టిన వైనం  సోషల్‌  విూడియాలో వైరల్‌ అయింది. దీన్ని ఎప్పుడు కూలుస్తారంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. 

అందుకే ఓవైసీ హైదరాబాద్‌ లో నెక్లెస్‌ రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్‌లో కట్టారని .. కూల్చేస్తారా అని ఆరోపించారు తమకు నష్టం జరుగుతుందనుకుంటే.. మజ్లిస్‌ .. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండదు. అయితే ప్రజల మద్దతు ఉంటే. ఈ అంశంపై ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నా.. గీత దాటి పోరన్న నమ్మకంతోనే.. హైడ్రాకు సూపర్‌ వపర్స్‌ ఇచ్చి ముఖ్యమంత్రి  కబ్జాదారులపై ఎటాక్‌ చేస్తున్నారన్న అబిప్రాయం వినిపిస్తోంది. హైడ్రాకు ఇప్పటికిప్పుడు ప్రజల మద్దతు పెరుగుతోంది. చెరువుల్ని కాపాడాలని చాలా కాలనీల్లో ప్రదర్శలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌ నమ్మకం నిలబడుతుందా.. ఎమ్మెల్యేలంతా వ్యతిరేకమై ఆయన సీటు కిందకు నీళ్లు తెస్తారా అన్నది వేచి చూడాల్సిందే

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....