Telangana లో రానున్న 4 రోజుల్లో వానలు కురిసే అవకాశం

అధికారులను అప్రమత్తం చేసిన  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మే 21 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో రానున్న 4 రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ కేంద్రం(ఐఎండి) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారుతుందని.. మే 22న వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడిరచింది. దీంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండి.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, బేగంపేట్‌, అవిూర్‌ పేట్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కొత్తపేట, ఎల్బి నగర్‌ తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ రోడ్లపై నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలని.. ట్రాఫిక్‌, విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే, మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని.. కాంటాలు వేసిన ధాన్యాన్నివెంటనే మిల్లులకు తరలించాలని సిఎం రేవంత్‌ ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....