Telangana లో Drugs అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ పక్కాగా అమలు : DG

హైదరాబాద్‌, జనవరి 24 ( ఇయ్యాల తెలంగాణ) : మెడికల్‌ షాపు నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మెడిసిన్స్‌ విక్రయించాలని రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ డీజీ కమలాసన్‌ రెడ్డి  స్ఫష్టం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ పక్కాగా అమలు చేస్తున్నామని.. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడడం తమ బాధ్యతని చెప్పారు. దేశంలో పలు చోట్ల నకిలీ మెడిసిన్స్‌ తయారు చేసి హైదరాబాద్‌ లో అమ్ముతున్నట్లు గుర్తించామని.. గత 6 నెలల్లో అలాంటి వాటిపై నిఘా పెంచామని చెప్పారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కేంద్రంగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడిరచారు. గత కొద్ది రోజులుగా నకిలీ మెడిసిన్‌ ఇంజక్షన్స్‌ సీజ్‌ చేశామని అన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్‌, ఏజెంట్ల ద్వారా నకిలీ మెడిసిన్స్‌ హైదరాబాద్‌ కు దిగుమతి చేస్తున్నారని డీజీ వివరించారు. 

రాష్ట్రంలో 42 వేల మందుల షాపులు ఉన్నాయని.. నకిలీ మందులు తక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని షాపులపైనా ప్రత్యేక నిఘా ఉంచామని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రజలకు మెడిసిన్స్‌ విక్రయించాలని స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు రవాణా ద్వారా కొరియర్‌ చేస్తోన్న ముఠాలను పట్టుకున్నామని.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్‌ కంట్రోల్‌ కు సంబంధించి ఓ ప్రత్యేక వెబ్‌ సైట్‌ రూపొందించినట్లు పేర్కొన్నారు.నకిలీ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడైనా అలాంటి మెడిసిన్స్‌ గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీజీ సూచించారు. తక్కువ ధరకే మందులు ఇస్తున్నారని.. డిస్కౌంట్ల పేరుతో మోసపోవద్దని చెప్పారు. నకిలీ ఔషధాలపై 1800`599`6969 టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....