Telugu లో విడుదలైన ‘‘నరివెట్ట’’

మలయాళ హీర టొవినో థామస్‌ నటించిన లేటెస్ట్‌ కాప్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంతో పాటు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది, టొవినో నటనకు ప్రసంశలు వస్తున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కింది.నరివెట్ట సినిమా చూస్తూ ఎమోషనల్‌ అయిన ఆడియన్స్‌, మలయాళంలో అలాగే తెలుగు లోను సక్సెస్‌ ఫుల్‌ గా థియేటర్స్‌ లో ప్రదర్షింపబడుతున్న ఈ సినిమా ను చూసి ఆడియన్స్‌ బావోద్యేగానికి లోనవుతున్నారు, ఈ విషయాన్ని తన సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసిన హీరో  టొవినో థామస్‌.

‘ఐడెంటిటీ’  ‘ఏఆర్‌ఎమ్‌’ మూవీస్‌ లో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ దక్కించుకున్నాడు. లేటెస్ట్‌ గా నరివెట్ట సినిమా ద్వారా ఇలా పోలీస్‌ స్టోరీ చిత్రంతో రావడంతో తెలుగు ప్రేక్షకుల్లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది.ఇక ఈ సినిమాను అనురాజ్‌ మనోహర్‌ డైరెక్ట్‌ చేస్తుండగా అబిన్‌ జోసెఫ్‌ ప్రొడ్యూస్‌ చేశారు. ఈ సినిమాలో సురాజ్‌ వెంజరమూడు, చెరణ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించాడు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....