TET పరీక్షలో వింత – ఒక Paper బదులు మరో Paper !

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 16 (ఇయ్యాల తెలంగాణ) :  టెట్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని పరీక్ష కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక పేపర్‌?కు బదులు మరో పేపర్‌ ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని పలు పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్‌ పరీక్ష కేంద్రాలలో సైన్స్‌ పేపర్‌?కు బదులు ఎన్విరాన్మెంట్‌ పేపర్‌?ను అభ్యర్థులకు ఇన్విజిలేటర్లు ఇచ్చారు. అప్పటికే అభ్యర్థులు 40 ప్రశ్నలకు సమాధానం దిద్దిన క్రమంలో సుమారు నలభై నిమిషాల తర్వాత పేపరు మారిందని జిల్లా గుర్తించిన అధికారులు అభ్యర్థులకు మ్యాథ్య్‌, సైన్స్‌ పేపర్‌ ఇచ్చారు. దాంతో అభ్యర్థులు ఆందోళన చేయగా ఓఎంఆర్‌ షీట్‌?పై వైట్నర్‌ తో రబ్‌ చేసి పరీక్ష రాయాలని అధికారులు అభ్యర్థులకు చెప్పారు. ప్రశ్నించిన కొందరు అభ్యర్థులను పరీక్ష హాల్‌ బయట పరీక్షలు రాయించిన అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు.జిల్లాలో టెట్‌ నిర్వహణలో తలెత్తిన సమస్యపై విద్యాధికారి రమేశ్‌ కుమార్‌ స్పందించారు. ప్రశ్నాపత్రాలు మారిన మాట వాస్తవమని, ఓఎంఆర్‌ షీట్లో ఆన్సర్లు రాసిన వాటిని సరిచేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఓఎంఆర్‌ షీట్లో వైట్నర్‌ ఉపయోగించేలా అనుమతిని ఇవ్వడం జరిగిందనీ అభ్యర్థులు వైట్నర్‌ వాడడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థులు రాసిన జవాబు పత్రాలను ఆన్లైన్‌లో పెడుతామని, అప్పుడు రాసిన జవాబులకు ఇచ్చిన మార్కులను అభ్యర్థులు చూసేందుకు వీలుంటుందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే అన్ని విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు. అన్యాయం జరిగితే అధికారులే బాధ్యులు అవుతారని టెట్‌ నిర్వహణలో తీసుకున్న తాత్కాలిక ఉపశమన మార్గాలతో ఎవరికీ అన్యాయం జరగకూడదని విపక్ష నేతలు చెబుతున్నారు. అనంతరం డీఈఓ?కు జరిగిన తప్పిదాలను టెట్‌ అభ్యర్థులు లిఖితపూర్వకంగా రాసి వినతి పత్రం సమర్పించారు.

టెట్‌ అభ్యర్థులు కలెక్టరేట్‌ చేరుకుని డీఈవో రమేశ్‌?తో మాట్లాడారు. అధికారులు తప్పిదాలు చేసిన విషయం వాస్తవం అయినప్పుడు అలాంటి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పడికే పోలీసులు నిర్బంధించడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో అభ్యర్థులు అధికారులు సూచించినట్లు పరీక్ష రాసి వచ్చారు. అన్ని పరీక్ష కేంద్రాలలో టెట్‌ పరీక్ష ఐదు గంటలకే ముగిస్తే పరీక్ష మారిన కేంద్రాల్లో మాత్రం ఆరు గంటల వరకు నిర్వహించారు. పరీక్ష రాసిన తరువాత అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద నిరసనకుదిగారు. వాస్తవానికి పరీక్షా కేంద్రం వద్ద ధర్నా చేసిన అఖిల పక్షం నాయకులు. ఓఎంఆర్‌ షీట్‌?పై వైట్నర్‌ తో దిద్దితే కంప్యూటర్‌ గుర్తించదని తీవ్రంగా ఆందోళన చేశారు. పరీక్ష కేంద్రాల వద్దకు అఖిలపక్ష, వామపక్ష నాయకులు చేరుకొని పరీక్ష కేంద్రాల ముందు బైఠాయించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌ కు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....