The Solo full melody – ‘చనువుగా చూసిన’ పాట విడుదల


ది సోల్‌ఫుల్‌ మెలోడీ ఆఫ్‌ ది సీజన్‌` 

పెదకాపు`1 నుంచి  ‘చనువుగా చూసిన’ పాట విడుదల  

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తన సినిమాల్లో ప్లజంట్‌ ట్యూన్‌లు ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘పెదకాపు`1’లో కూడా బ్యూటీ ఫుల్‌ సాంగ్స్‌ వున్నాయి. సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతం అందించారు. ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోకు మంచి స్పందన లభించింది.ఈరోజు పూర్తి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. లీడ్‌ పెయిర్‌ ఆకర్షణీయమైన రొమాంటిక్‌ కెమిస్ట్రీతో ప్రోమో అలరించగా, పూర్తి పాట వారి అందమైన ప్రేమకథను ప్రజంట్‌ చేసింది. మిక్కీ జె మేయర్‌ లవ్లీ  మెలోడీతో మ్యాజిక్‌ చేశారు. అనురాగ్‌ కళ్యాణ కులకర్ణి, చైత్ర అంబడిపూడి వాయిస్‌ మెస్మరైజ్‌ చేస్తోంది.

 కళ్యాణచక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ప్రేమలోని లోతుని అద్భుతంగా వర్ణిస్తుంది.కన్నుల విందుగా చిత్రీకరించిన ఈ పాటలోని విజువల్స్‌ కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ఇద్దరూ అందంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ పాటలో బాగా వర్కౌట్‌ అయింది. ఈ పాట ఇన్స్టంట్‌ చార్ట్‌బస్టర్‌ కాబోతోంది.అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్‌ అడ్డాల కథ`కథనంలో తన ప్రతిభను చూపించారు. టీజర్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రముఖ యాక్షన్‌ దర్శకుడు పీటర్‌ హెయిన్స్‌ ఫైట్స్‌ను పర్యవేక్షించగా రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. నటీనటులు: విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్‌, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్‌ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్‌ తదితరులు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....