Thursday ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తం !

భువనేశ్వర్‌,జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : ఒడిశాలోని పూరీ జగన్నా ధుని  శ్రీ క్షేత్రరత్న భాండా గారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోను న్నాయి.ఇందుకు గురువారం  ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షు డు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.  సమావేశం అనంతరం జస్టిస్‌ రథ్‌, ఆలయ పాలనాధికారి అరవింద పాఢ విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్రూంకు తరలించ మన్నారు.. 

ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావ స్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తామ న్నారు.  పనులు పూర్తయ్యాక సంప దనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామ’ని వెల్లడిరచా రు.రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపి వేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....