👉 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
👉 ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు
తిరుపతి, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
👉 29`02`2024 ఉదయం ` ధ్వజారోహణం(విూనలగ్నం), రాత్రి ` పెద్దశేష వాహనం
👉 01`03`2024 ఉదయం ` చిన్నశేష వాహనం, రాత్రి ` హంస వాహనం
👉 02`03`2024 ఉదయం ` సింహ వాహనం, రాత్రి ` ముత్యపుపందిరి వాహనం
👉 03`03`2024 ఉదయం ` కల్పవృక్ష వాహనం, రాత్రి ` సర్వభూపాల వాహనం
👉 04`03`2024 ఉదయం ` పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం), రాత్రి ` గరుడ వాహనం
👉 05`03`2024 ఉదయం ` హనుమంత వాహనం, సాయంత్రం ` స్వర్ణరథం, రాత్రి ` గజ వాహనం
👉 06`03`2024 ఉదయం ` సూర్యప్రభ వాహనం, రాత్రి ` చంద్రప్రభ వాహనం
👉 07`03`2024 ఉదయం ? రథోత్సవం, రాత్రి ? అశ్వవాహనం
👉 08`03`2024 ఉదయం ? చక్రస్నానం, రాత్రి ? ధ్వజావరోహణం
👉 ఫిబ్రవరి 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.