Tirupati – శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ

👉 శ్రీవారి పాదాల మండపంలో- వైభవంగా జరిగిన అభిషేకం.

👉 వైకుంఠ ద్వారం ఏర్పాటు.

తిరుపతి, డిసెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం అలిపిరిలోని శ్రీవారి పాదాల మండపంలో స్వామివారికి శ్రీవారి భక్తుడు టీవీ మనోహర్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు.గత 24 సంవత్సరాలుగా స్థానిక సరోజినీ దేవి రోడ్డు కు చెందిన శ్రీవారి భక్తుడు టీవీ మనోహర్‌ కుటుంబ సభ్యులు వైకుంఠ ఏకాదశి కి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో భాగంగా అలిపిరిలో శ్రీవారికి శ్రీవారి పాదాలకు శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయ తరహాలోనే విశేష అభిషేకం జరిగింది.అర్చక స్వాములు శ్రీనివాస మూర్తి సుదర్శనాచార్యులు ఉదయాతూర్పం భోగ శ్రీనివాసమూర్తిని తిరుప్పావైతో  మొలోకొల్పారు. తదనంతరం శ్రీవారికి శ్రీవారి పాదాలకు బోగ శ్రీనివాస మూర్తి కి పాలు పెరుగు పన్నీరు పంచామృతం చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించారు. తదనంతరం నూతన వస్త్రాలను అలంకరించారు. 

అదేవిధంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారికి , శ్రీ గోదాదేవి అమ్మవారికి, శ్రీ పెరియాల్వార్‌, శ్రీఆంజనేయ స్వామి వారికి పట్టు, వస్త్రాలను టీవీ మనోహర్‌ దంపతులు సమర్పించారు.ఈ వస్త్రాలను స్థానిక ఆలయాల డిప్యూటీ ఈ ఓ వీ ఆర్‌ శాంత, ఏ ఈ ఓ ముని కృష్ణా రెడ్డి, టెంపుల్‌ ఇన్స్పెక్టర్‌ వి శ్రీనివాస రావు,షరాబు పి దేవయ్య తదితరులు అందుకొన్నారు. 

శ్రీవారి పాదాల మండపం లో గత 24 ఏళ్లుగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు.టిటిడి గార్డెన్‌ మేనేజర్‌ జనార్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడి అందించిన పుష్పాలతో పాటు దాతలు టీవీ మనోహర్‌,కాసరం హరీష్‌,శిల్పం విద్యా సాగర్‌, ఆదం దశరదరామి రెడ్డి , రెడ్డమ్మ తదితరులు పుష్పాలను అందించారు. ఈ ప్రత్యేక  వైకుంఠ ద్వారం రెండు రోజుల పాటు ఏర్పాటు చేయనున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....