TSPSC చైర్మన్‌ రాజీనామాపై డైలామాలో గవర్నర్‌

హైదరాబాద్‌ డిసెంబర్‌ 12 (ఇయ్యాల తెలంగాణ) : పేపర్‌ లీకులు అయినప్పుడే నిరుద్యోగుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళసై లేఖ రాశారు. అప్పుడు దానిని డీఓపీటీకి రాష్ట్రపతి అధికారులు పంపించారు. టీఎస్‌ పీఎస్సీ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని .. ఏం జరిగిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి లేఖ అందింది. మునుపటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇపుడు ప్రభుత్వం మారగానే టీఎస్‌ఎస్‌పీఎస్సీ చైర్మన్‌ రాజీనామా లేఖ ఇచ్చారు.ఇప్పటికే కోర్టులో పేపర్‌ లీకు కేసు ఉంది. గతంలో చర్యలు తీసుకునేలా బోర్డును పుర్తిగా రద్దు చేసేలా ముందుకి వెళ్లడమా..? లేదంటే జనార్దన్‌ రెడ్డి రాజీనామాను ఆమోదించడమా? అనే దానిపై గవర్నర్‌ సందిగ్ధంలో ఉన్నారు. రాజీనామా ఆమోదిస్తే పేపర్‌ లీకు సంగతి అంతేనా అనే ఆలోచనలో గవర్నర్‌ తమిళి సై ఉన్నారు. లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవడంతో పాటు.. ప్రస్తుత రాష్ట్ర సర్కార్‌ స్టాండ్‌ తెలుసుకునేందుకు సీఎస్‌కు లేఖ రాసే అవకాశం ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....