TSRTC – హైదరాబాద్‌ లో ఎలక్ట్రిక్‌ బస్సులు “

హైదరాబాద్‌, జూలై 23 (ఇయ్యాల తెలంగాణ)

హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ఈమేరకు  నుంచి 300 ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేసేందుకు ఒప్పంద చేసుకుంది. వీటి కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఎంఈఐఎల్‌  గ్రూప్‌ కంపెనీ ఇుఇజ, టీఎస్‌ఆర్టీసీల నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్ని అందుకుంది. ఈ మేరకు  ఆర్టీసీ నుంచి ఆర్డర్‌ ను పొందింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రకటించిన ఫేమ్‌ ? 2 పథకం కింద టీఎస్‌ఆర్టీసీ 300 ఎలక్ట్రిక్‌ బస్సులను కోనుగోలు చేయనుంది. 12 ఏళ్లకుగానూ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను కొనగోలు చేయనుంది. ఒలెక్ట్రా ఈ బస్సులను వచ్చే 20 నెలల్లో టీఎస్‌ఆర్టీసీకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణకు కూడా ఒలెక్ట్రా చూసుకుంటుంది.ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ మాట్లాడుతూ, ‘‘మరో ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ను దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మా అత్యాధునిక జీరో`ఎమిషన్‌ బస్సులతో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నందుకు గర్విస్తున్నాం. మా బస్సులు ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులను విమానాశ్రయానికి విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. మేం షెడ్యూల్‌ ప్రకారం బస్సులను అందజేస్తాం. ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాం’’ అంటూ తెలిపారు.ఈ బస్సులు 12`విూటర్లు, లో ఫ్లోర్‌, నాన్‌`ఏసీ బస్సులు 35Gడి సీటింగ్‌ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్‌ కంట్రోల్డ్‌ ఎయిర్‌ సస్పెన్షన్‌తో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉంటాయి. బస్సులో అమర్చిన లిథియం`అయాన్‌  బ్యాటరీ ట్రాఫిక్‌, ప్రయాణీకుల లోడ్‌ పరిస్థితుల ఆధారంగా ఒక ఛార్జ్‌తో 180 కిలోవిూటర్లు ప్రయాణించేలా చేస్తుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....