Vande Bharath రైలులో మంటలు – ప్రయాణికులు సురక్షితం


భోపాల్‌, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) :  వందేభారత్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీ కి వెళుతున్న వందేభారత్‌ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం మధ్య ప్రదేశ్‌ లోని కుర్వాయి కేతోరా స్టేషన్‌ వద్ద జరిగింది. రాణికమలాపతి  స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి కేతోరా స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ బాక్స్‌ దగ్గరనుంచి  మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్కు సమాచారం అందించారు. దీంతో రైలును అక్కడే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక దళం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....