తిరువనంతపురం, సెప్టెంబర్ 19, (ఇయ్యాల తెలంగాణ ); బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ ఆంటోని కూతురు విూరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విూరా 12 వ తరగతి చదువుతోంది. ఆత్మహత్యకు పాల్పడిరదని తెలిసిన వెంటనే దగ్గర్లోనియూ కావేరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. విూరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విూరా ఆత్మహత్యకు కారణం ఏంటా అని దర్యాప్తు చేస్తున్నారు.విజయ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు సంగీతం అందించారు. అలాగే సింగర్ గాను తన ప్రతిభ చాటారు. ఇక బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్ ఆంటోని అంతకు ముందు పలు సినిమాలతో తెలుగులో అలరించారు. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ ఆంటోనీ ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకేఒక్క కూతురు విూరా. విూరా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
- Homepage
- iyyala Cinema
- VIJAY ANTONY ఆంటోని కూతురు ఆత్మహత్య
VIJAY ANTONY ఆంటోని కూతురు ఆత్మహత్య
Leave a Comment
Related Post