Vote హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం దంపతులు !

సిద్దిపేట, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్‌ టౌన్‌ లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలురు) లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు తమ ఓటు హక్కు  వినియోగించుకున్నారు. వేరు వేరు క్యూలైన్ల లో నిలబడి  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ హుస్నాబాద్‌ ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో పట్టబద్రునిగా ఓటు హక్కు వినియోగించు కున్న.. మిగతా పట్టభద్రులు అందరి విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి  తెలంగాణ కు రావాల్సిన ప్రాజెక్టు ల పై మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్‌ఎస్‌  పార్టీ మమ్మల్ని సంప్రదించలేదు రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదు.. ముఖ్యమంత్రి ప్రధాని వస్తే కలవడంలేదు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంపీలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఫెడరల్‌ సిస్టం లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే సంబంధాల దృశ్య రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు అడుగుతున్నాం. రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డి  బాద్యులువారు ఆపుతున్నట్లు ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ ,మూసి ,నీతీతీ అవతల ట్రిపుల్‌ ఆర్‌ ,హైదరాబాద్‌ తాగు నీటి సమస్య ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించాం. కేంద్రం తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన హావిూలు నెరవేర్చల్సి ఉంది. 

10 సంవత్సరాలుగా బీఆర్‌ఎసక్‌  ప్రభుత్వం  మిమ్మల్ని అడుగుత లేదని కారణం చూపారు. మేము కాలికి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. ఇవి రాకపోతే మా బాధ్యత అని ఉల్టా దాడి చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులుగా విూరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కనుగుణంగా రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి నిధులు తేవాల్సిందేనని అన్నారు. నిధులు తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. విూరు బీఆర్‌ఎస్‌ బ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. విూరు బిఆర్‌ఎస్‌ పార్టీ కలిసి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఢల్లీిలో దోస్తీ గల్లీలో కుస్తి అని ముందు నుండి చెబుతున్నాం. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేము తెలంగాణ ప్రభుత్వముగా ప్రతి రూపాయి జీఎస్టీ ప్రతి పన్ను రూపమలో ఎక్కడ తేడా రానివ్వడం లేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు పై కూడా అంతే స్థాయిలో గట్టిగా కొట్లాడుతాం. తెలంగాణ కు ప్రతి ప్రాజెక్టు తేవాల్సిన బాధ్యత కిషన్‌ రెడ్డి ది లేదంటే భవిషత్‌ లో  తీవ్ర పోరాటాలు జరుగుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్‌ మోడల్‌ గా తీసుకున్న  కుల సర్వే పై మొదటి వారంలో శాసన సభలో చట్టం చేసి రాజకీయ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈ బీసీ కి సంబంధించి విూరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదేవిధంగా దీనిని కూడా దాని మాదిరిగానే మార్చలిసిందే. రాజకీయ కారణం చూపిస్తే సరిపోదు. గుజరాత్‌ లో ప్రధాని స్టేట్మెంట్‌ ఉంది కానీ మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసి మత పరమైన పబ్బం గడుపుతున్నారు. క్రికెట్‌ లు పాకిస్తాన్‌ ఇండియా అంటూ రాజకీయాలు రెచ్చగొడుతున్నారు. మాకు తెలంగాణ ప్రయోజనాలు ప్రజల అభివృద్ది ముఖ్యం. తమిళనాడు అన్ని రాజకీయ విభేదాలు ఉన్న అభివృద్ధి ప్రయోజనాలు విషయంలో అందరి మాట ఒక్క మాట విూద ఉంటారు. తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తో కేంద్రంలో ఉన్న బీజేపీ కలిసి వచ్చి పెద్దన్న పాత్ర పోషించి నిధులు కేటాయించే ప్రయత్నం చేయాలి వారి బాధ్యత లేదంటే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు.

కేటీఆర్‌ మాటలు వింటే నవ్వుతున్నారు. ఢల్లి లో కాంగ్రెస్‌ ఓడిపోతే ట్వీట్‌ చేస్తున్నారు.. పంటలు ఎండిపోతే ట్వీట్‌ చేస్తున్నారు. అందరూ మంచిగా ఉండలని సమృద్ధిగా వర్షాలు ఉండలని నిన్ననే శివరాత్రి మొక్కుకున్నాం. అందరూ మంచిగా ఉండలని మొక్కుకో వర్షాలకు ఎవరు ఏం చేయలేరు. ఈ ప్రభుత్వం తాగు సాగు నీటికి చర్యలు తీసుకుంటుందని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....