Wach man కు 3 ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌, మార్చి 2 (ఇయ్యాల తెలంగాణ) : పట్టుదలతో ప్రయత్నిస్తే… ఏదైనా మన సొంతం అవుతుందని నిరూపించాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రవీణ్‌ అనే యువకుడు. నైట్‌ వాచ్‌ మెన్‌ గా పని చేస్తూనే… ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించాడు. తాజా వెల్లడిరచిన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీతో పాటు జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు ప్రవీణ్‌ ప్రస్థానం… సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ గా మారింది. ప్రవీణ్‌ కు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్‌ బ్రదర్‌ అంటూ పోస్టులు చూస్తున్నారు.ప్రవీణ్‌ ది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్‌ గ్రామం. ఓయూ క్యాంపస్‌ లో ఎంకాం, బీఈడీ, ఎంఈడీ పూర్తి చేశాడు. 

ప్రవీణ్‌ తల్లిదండ్రులు స్వగ్రామంలో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తండ్రి మేస్త్రీ పని చేస్తుండగా… తల్లి బీడీ కార్మికులు. వారికి భారంగా కావొద్దని భావించిన ప్రవీణ్‌… ఓయూ క్యాంపస్‌ లో ఉన్న ఈఎంఆర్‌ సీలో నైట్‌ వాచ్‌ మెన్‌ గా చేరాడు. గత ఐదేళ్లుగా అక్కడ పని చేస్తూనే…. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నాడు. తన ఖర్చులు తల్లిదండ్రులకు భారం కావొద్దని భావించిన ప్రవీణ్‌… నైట్‌ వాచ్‌ మెన్‌ గా చేరాడు.ఇక ప్రవీణ్‌ ఎలాంటి కోచింగ్‌ లేకుండానే సొంతంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యాడు. యూట్యూబ్‌ లోని కంటెంట్‌ ను సేకరిస్తూ తన సాధనకు మరింత పదును పెట్టాడు. 2018లో డీఎస్సీ పరీక్ష రాసిన ప్రవీణ్‌,,, కేవలం అర మార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత గ్రూప్‌ 2 కోసం కూడా చదివాడు. అయితే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన ప్రవీణ్‌… ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికై తనకు తానే సాటి అని చాటిచెప్పాడు.ప్రవీణ్‌ మూడు ఉద్యోగాలకు ఎంపిక అవ్వటం పట్ల అతను వాచ్‌ మెన్‌ గా పని చేసిన ఇఓఖీఅ ప్రాంగణం డైరెక్టర్‌ పి రఘపతి హర్షం వ్యక్తం చేశారు. అక్కడ పని చేస్తున్న ఇతర సిబ్బంది కూడా ప్రవీణ్‌ కు అభినందనలు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....