వైబ్రంట్‌ Folk Song సైలోరే రిలీజ్‌

అనుష్క శెట్టి, విక్రమ్‌ ప్రభు, క్రిష్‌ జాగర్లమూడి, ఙప క్రియేషన్స్‌ ప్రెజెంట్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘ఘాటి’ ఫస్ట్‌ సింగిల్‌ వైబ్రంట్‌ ఫోక్‌ సాంగ్‌ సైలోరే రిలీజ్‌

క్వీన్‌ అనుష్క శెట్టి, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఘాటి’ గ్లింప్స్‌ లో ఇంటెన్స్‌ వైలెంట్‌ క్యారెక్టర్‌ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ స్టార్‌ విక్రమ్‌ ప్రభు ఇంటెన్స్‌ అవతార్‌ లో కనిపించిన క్యారెక్టర్‌ గ్లింప్స్‌ సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని ఙప క్రియేషన్స్‌ సమర్పిస్తుంది. రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు. ఘాటి జూలై 11న రిలీజ్‌ కానుంది.

మేకర్స్‌ తాజాగా జానపద ఊపుతో నిండిన పాట ‘‘సైలోరే’’ సాంగ్‌ ని విడుదల చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్‌ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకృతిసౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్‌ వెడ్డింగ్‌ యాంథమ్‌లో లీడ్‌ పెయిర్‌ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనుష్క, విక్రమ్‌ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళా తాళాలతో, భావోద్వేగాలతో నింపారు.

నాగవెళ్లి విద్యాసాగర్‌ స్వరపరిచిన ఈ మనసును తాకే పాట జానపదపు స్వరాలను భావోద్వేగాలకు మిళితం చేస్తూ అద్భుతంగా వుంది. కృష్ణ రాసిన సాహిత్యం హుషారు వుంది. లిప్సిక భాష్యం, సాగర్‌ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట ఉత్సవాన్ని మరింత పెంచింది. రాజు సుందరం కోరోయోగ్రఫీ అద్భుతంగా వుంది.

ఈ సినిమాకి మనోజ్‌ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్‌ డైరెక్టర్‌. సాయి మాధవ్‌ బుర్రా మాటలు రాశారు.

ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్‌ ఇండియా విడుదల అవుతుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....