WIFE చేతుల్లో చావుదెబ్బలు తింటున్న HUSBANDS

భార్య చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు  

బయో సోషల్‌ స్టడీస్‌ సంస్థ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ మార్చ్‌ 5 (ఇయ్యాల తెలంగాణ) : రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచించాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. వీరికి బోలెడన్ని కండీషన్స్‌. భర్త   అడుగు జాడల్లో నడవాలి. అత్తామామ చెప్పినట్టుగా వినాలి. ఇంటి పని.. వంట పని సవ్యంగా చేయాలి. కానీ ఇదంతా ఆ రోజుల్లో..పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. పెళ్లవగానే వేరు కాపురం.. భార్య   అడుగు జాడల్లోనే ఇప్పుడు భర్త నడవాలి. లేదంటే అప్పడాల కర్ర తిరగేసి మరీ లైన్‌లో పెడుతున్నారు.

‘తాజాగా భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు’ అనే అంశంపై సర్వే జరిగింది. బయో సోషల్‌ స్టడీస్‌   అనే సర్వే సంస్థ దీనిని నిర్వహించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది. ఈ సర్వే  లో ఆసక్తికర విషయమొకటి వెలుగు చూసింది. ఇలా భార్యల చేతిలో చావు దెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణ  లోనే ఎక్కువట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువని తేలింది. భారత్‌  లో పురుషులకు రక్షణ చట్టాలు లేకపోవడమే కారణమని అధ్యయనం తేల్చింది. గతంతో పోల్చుకుంటే భార్యల చేతిలో దెబ్బలు తింటున్న వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపైందట. 

తెలంగాణలో టాక్స్‌ పేయర్స్‌ సంఖ్య అదేనండి.. తాగుబోతుల సంఖ్య చాలా ఎక్కువే. పుట్టుక నుంచి చావు వరకూ.. అకేషన్‌ ఏదైనా సరే.. మందు ఉండాల్సిందే. ఇక తాగేసి కుటుంబాన్ని పట్టించుకోకపోగా.. అప్పులు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారట. మరి ఇదంతా చూస్తూ భార్యలు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తున్నారట. గత 15 ఏళ్లలో భార్తలపై దాడులు చేస్తున్న వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందట. 2006లో ఆరుగురు మహిళలు మాత్రమే భర్తలపై చేయి చేసుకునే వారట. ఇప్పుడు ఆ సంఖ్య 36కి పెరిగిందట.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....