Women’s పై జరిగిన అత్యాచారాలు నిరసిస్తూ నారీ శక్తి వందన్‌.

మహిళలపై జరిగిన అత్యాచారాలు నిరసిస్తూ నారీ శక్తి వందన్‌.

500 మంది విద్యార్థినులతో 2 కె వాక్‌.

నంద్యాల

పచ్చిమ బెంగాల్లో సందేశ్‌ ఖలీ లో మహిళలపై జరిగిన అత్యాచారాలను నిరసిస్తూ నారీ శక్తి వందన్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మదు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మహిళా సాధికారత కు చేసిన కృషి,సంక్షేమ పథకాలు,సంస్కరణలు,పశ్చిమ బెంగాల్‌ లో మహిళలపై జరిగిన అత్యాచారాలను నిరసిస్తూ నారీ శక్తి వందన్‌ కార్యక్రమం  నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మదు అధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దాదాపు 500 మంది విద్యార్థినులతో టౌన్‌ హాల్‌ నుంచి శ్రీనివాస సెంటర్‌,సంజీవ నగర్‌ గేట్‌ వరకు 2 కే రన్‌ కు జండా ఊపి ప్రారంభించారు.

 భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు  బత్తిని స్వాతి  ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో నారి శక్తి వం  దన్‌  కార్యక్రమంలో భాగంగా 2కె మారథాన్‌

భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు  వనిత శ్రీనివాసన్‌, రాష్ట్ర మహిళా మోర్చా   నిర్మల కిషోర్‌ కారు నంద్యాల జిల్లా అధ్యక్షులు బైరెడ్డి శబరి , నంద్యాల అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మధు  సూచనల మేరకు నారీ శక్తి వందన్‌  కార్యక్రమంలో భాగంగా రన్‌ ఫర్‌ నేషన్‌  రన్‌ ఫర్‌ మోడీ 2కె వాక్‌ కార్యక్రమాన్ని 500 మంది విద్యార్థులతో నంద్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు  బత్తిని స్వాతి  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి  సురవరం గీతామాధురి , నంద్యాల అసెంబ్లీ కన్వీనర్‌ అభిరుచి మధు , రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి   పాల్గొనడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  జిల్లా మహిళా మోర్చా నాయకులు మధుర, శ్రీవాణి, సౌజన్య, శ్రీ జ్యోతి పాల్గొన్నారు.. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులు మేడం మురళీధర్‌ , కశెట్టి కృష్ణమూర్తి , డాక్టర్‌ ఇంటి ఆదినారాయణ  గోపాలకృష్ణ  పాల్గొన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణ అధ్యక్షులు కశెట్టి చంద్ర శేఖర్‌, శివ సాయి, ఉపేంద్ర , లక్ష్మి రెడ్డి  పాల్గొన్నారు.. కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి  ,కార్యకర్తలు పాల్గొనడం జరిగినది..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....