wow అంతా టమోటా మహత్యం – కోటీశ్వరులు… బిచ్చగాళ్లు..!

హైదరాబాద్‌, కర్నూలు డిసెంబర్‌ 10 (ఇయ్యాల తెలంగాణ) : నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్‌ విసిరింది. ఆ తర్వాత.. చాలారోజుల వరకూ అరవై రూపాయలు.. కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే.. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. ఇప్పుడు ఒక్కసారిగా పతనమయింది. ఎంతలా అంటే.. ఊహించని రేంజ్‌లో పడిపోయింది. కిలో వంద రూపాయల వరకూ పలికిన టమాటా.. ఇప్పుడు ఒక్కరూపాయికి చేరుకోవడం టమాటా రైతులకు షాకిస్తోంది. టమాటా పండిరచిన రైతులను కోటీశ్వరులను చేసినట్లే.. బిక్షగాళ్లను కూడా చేస్తుంది. అందుకే టమాటా ధర కొన్ని నెలలు మాత్రం పెరుగుతుంటుంది. ప్రధానంగా సెప్టంబరు నుంచి నవంబరు నెల వరకూ టమాటా ధర బాగా ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెప్పారు. 

ఆ సమయంలో పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయి. టమాటా ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్లనే ధరలు ఆ సమయంలో విపరీతంగా పెరుగుతుతాయి. మళ్లీ డిసెంబరు నెల నుంచి టమాటా పంట చేతికి అందుతుంది. అన్ని మార్కెట్‌ లో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుంటారు. ఈ సమయంలో టమాటా ధర తక్కువగానే ఉంటుంది. వినియోగదారుడికి కూడా కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం టమాటా ధర బాగా పడిపోయింది. పత్తికొండ రైతు మార్కెట్లో కిలో టమోటా ధర రూపాయికి పడిపోవడంతో టమోటా రైతు ఆందోళన చెందుతున్నాడు. హైదరాబాద్‌ మార్కెట్లో డిమాండ్‌ లేకపోవడంతో టమోటా ధర తగ్గిందని చెబుతున్నారు. 

మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పారు. నిన్న మొన్నటి దాకా కిలో పది నుండి 20 రూపాయలు పలికిన టమోటా ధర ఇప్పుడు రూపాయికి పడిపోవడంతో రైతు లబోదిబో మంటున్నాడు. టమాటా రైతు పరిస్థితి లాటరీలాగా మారింది. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర కుప్పకూలి ఒక్క రూపాయికి పడిపోయింది. కిలో టమాటా రూపాయి పలకడంతోపాటు రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తెచ్చిన పంటను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాక పోవడంతో టమాటాలను రోడ్డు పక్కన పారబోసి వెళ్లిపోయారు రైతులు. అయితే.. పలు ప్రాంతాల నుంచి భారీగా టమాటా దిగుబడి వస్తుండటమే రేటు పడిపోవడానికి కారణమంటున్నారు స్థానిక రైతులు. సరుకు ఎక్కువ ఉండడంతో మార్కెట్‌లో టమాటా కొనేవారు లేకుండా పోయారని చెప్తున్నారు. ప్రధానంగా.. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకూ పంట దిగుబడి తక్కువగా ఉండడంతో టమాటా ధర ఎక్కువగా ఉంటుందంటున్నారు వ్యాపారులు.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయని తెలిపారు. కానీ.. డిసెంబర్‌ నుంచి టమాటా పంట చేతికి వస్తుండడంతో.. అన్ని మార్కెట్‌లలో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుండడంతో టమాటా ధర తక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా.. పతనమవుతున్న టమాటా ధర.. రైతులకు కన్నీళ్ళు మిగుల్చుతోంది.

హైదరాబాదులో కిలో టమాటా 40 రూపాయలు

ఇతర ప్రాంతాలలో కిలో రూపాయి పలుకుతున్న టమాటా.. హైదరాబాదు లాంటి ఏరియాలలో కిలో 30 నుంచి 40 వరకు పలుకుతోంది. సెప్టెంబర్‌ ? నవంబర్‌, డిసెంబర్‌ తొలి వారంలో టమాటా కిలో 70 రూపాయల వరకు చేరుకుంది. డిమాండ్‌ కూడా అధికంగా ఉంది. ఏపీలో రూపాయి మాత్రమే పలుకుతున్న టమాటా.. హైదరాబాదు లాంటి ప్రాంతాలకు వచ్చేసరికి 400 రెట్లు పెరగడం విశేషం. అయితే మధ్యలో వ్యాపారులు రవాణా ఖర్చులని, ఇతర ఖర్చులని చెప్పి ధరలను అమాంతం పెంచుతున్నారు. పండిరచిన రైతులు నష్టపోతుంటే.. వారు మాత్రం కోట్లను గడిస్తున్నారు. ఆరుగాలం పంట పండిరచిన రైతులకు మాత్రం అప్పులను, పుట్టెడు కష్టాలను మిగుల్చుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....