న్యూఢిల్లీ, జూన్ 7 (ఇయ్యాల తెలంగాణ) : నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 5) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. అలాగే, 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ. రాష్ట్రపతి దీనిని అంగీకరించి, తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము మధ్య భేటీకి సంబంధించిన దృశ్యాలు వెలువడ్డాయి. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ముందు ప్రధాని మోదీ తన రాజీనామాను అధ్యక్షుడు ముర్ముకు సమర్పించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ, ఎన్డీఏ కూటమి సమావేశంలో మరోసారి ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ. జూన్ నెల 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 263 స్థానాలు దక్కాయి. ఎన్డీఏ 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కూటమి నేతలు కోరబోతున్నారు.
జూన్ 8న మరోసారి మోదీ దేశ ప్రధానిగా ప్రమాణం
జూన్ నెల 8వ తేదీన మరోసారి మోదీ దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.నిజానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 294 సీట్లతో మెజారిటీ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలు తప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రావడం కష్టమే. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఇరువురు నేతలు మాత్రం ఇప్పటికే ఎన్డీయేతోనే ఉంటామనే సంకేతాలు ఇచ్చారు.బుధవారం ఢిల్లీ లో ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు దాని మిత్రపక్షాల ప్రముఖ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. నితీష్ కుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు ఈ కారణంగానే జూన్ 7న పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీయే ఎంపీలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలను సవిూక్షించడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. దీనిపై లోతుగా చర్చించిన తర్వాతే ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.