న్యూఢిల్లీ, జూన్ 05 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అంతకుముందు అయన కేంద్ర మంత్రి మండలితో కలిసి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించారు. మరియు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని అభ్యర్థించారు.